క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానం: డివైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐ

క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానం: డివైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐ

కర్నూలు, న్యూస్ వెలుగు; సంక్రాంతి సందర్భంగా డివైఎఫ్ఐ,ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ముజాఫర్ నగర్ లో 14వ తేదీన ప్రారంభమై 3రోజుల పాటు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు గురువారం స్థానిక డివైఎఫ్ఐ నాయకులు విజయ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్,నగర కార్యదర్శి హుస్సేన్ భాష మాట్లాడుతూ చాలా ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం సంతోషకరమని తెలిపారు.ఫిజికల్ గేమ్స్ ఆడటం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడానికి ఉపయోగపడుతుందని అందుకే రోజు మొబైల్ గేమ్స్ ను మానేసి,ఫిజికల్ గేమ్స్ ఆడాలని పిలుపునిచ్చారు. క్రికెట్,కబడ్డీ ఏదైనా ఆటలు నిర్వహించుకోవడానికి యువతీ,యువకులకు స్థానికంగా ఎటువంటి మైదానాలు లేక సొంత స్థలాలలోనే ఆడుకుంటున్నారని,కాబట్టి ప్రభుత్వం స్టేడియాల ప్రైవేటికరణను ఆపి, స్థానికంగా యువత ఆటలు నిర్వహించుకోవడానికి మైదానాలను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.క్రికెట్ టోర్నమెంట్ లో గెలుపొందిన విన్నర్స్ టీంకు మొదటి బహుమతి 5000/- రూపాయలను డివైఎఫ్ జిల్లా కార్యదర్శి నగేష్,రన్నర్స్ టీంకు రెండవ బహుమతి 2000/- రూపాయలను నెమలి మధుకృష్ణ అందజేశారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు వినోద్,ధను, సూరి,శ్రావణ్,అఖిల్ మాజీ నాయకులు ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!