
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు ; జమ్మలమడుగు పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు పట్టణ పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు మిడుతూరు ప్రసాదు వర్కింగ్ ప్రెసిడెంట్ గంగాధర్ కార్యదర్శి ప్రతాప్ అధికారులకు విజ్ఞప్తి చేశారు శుక్రవారం నాడు మున్సిపల్ కమిషనర్ ప్రమోదు గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మలమడుగు మున్సిపాలిటీ నందు పారిశుద్ధ విభాగంలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు పండుగ జాతీయ సెలవు దినాలను పూర్తిగా అందించాలని అలాగే మహిళా కార్మికులకు ఐదు రోజుల ప్రత్యేక సెలవు దినాలు మంజూరు చేయాలని. జాతీయ సెలవు దినాలలో పూర్తిగా సెలవు ఇవ్వాలని వారు కమిషనర్ ని కోరారు గత తొమ్మిది నెలల క్రితం మరణించినటువంటి పరిశుద్ధ కార్మికులు సుగుణయ్య విజయ రాజులకు వెంటనే ఎక్స్గ్రేషియా అందించాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు యాకోబు మురళి రాజేష్ జయపాల్ దాసు శేఖర్ వినోద్ పద్మావతమ్మ తదితరులు పాల్గొన్నారు.