
సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి
నగరపాలక అదనపు కమిషనర్ ఆర్.జి.వి. క్రిష్ణ
* ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి 15 అర్జీలు
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరంలో వివిధ కాలనీలకు సంబంధించి ప్రజలు తెలుపుతున్న సమస్యలకు సత్వర పరిష్కారం 
వచ్చిన విన్నపాల్లో కొన్ని..
1. ఏ.క్యాంపు లక్ష్మి గార్డేన్స్ నందు రహదారుల శుభ్రత, మురుగు కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని స్థానికులు భాస్కర్ రెడ్డి, జయన్న, శంకర్ రెడ్డి తదితరులు విన్నవించారు.
2. మహాలక్ష్మి నగర్ మిలటరీ కాలనీ నందు ఖాళీ స్థలంలో పిచ్చిమొక్కలు బాగా పెరిగిపోయాయని, దానిని పందులు ఆవాసంగా మార్చుకున్నాయని స్థానికులు జి.రాజేష్ ఫిర్యాదు చేశారు.
3. సంపత్ నగర్ నందు పూడికతీత పనులు, వీధి దీపాల మరమత్తులు, పార్కు అభివృద్ధి, పందులు, నీటి సమస్యలను పరిష్కరించాలని స్థానిక కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు మల్లికార్జునరెడ్డి, వెంకటరమణ కోరారు.
4. 27వ వార్డు ఆదిత్య నగర్ నందు మురుగు కాలువ నిర్మించాలని రైతు సంఘం నాయకులు ఎస్.లక్ష్మి రెడ్డి విన్నవించారు. ఇదే సమస్యను 18వ వార్డు జోహరపురం, 27వ వెంకటాద్రి నగర్ వాసులు మహేష్, గౌస్ తెలిపారు
5. 34వ వార్డు నిర్మల్ నగర్ నందు తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు ఎం.ఏ. బాబు, నర్సింహారావు, తదితరులు కోరారు. ఇదే సమస్యను ఎన్టీఆర్ నగర్ 10వ లైన్ వాసులు గౌస్ బాష, ఖాజా హుస్సేన్, జరీనా తదితరులు విన్నవించారు.
6. పందిపాడు శివారులోని ఇందిరమ్మ కాలనీ నందు రహదారులు, మురుగు కాలువలు, వీధి దీపాలు, ఇంటి పన్ను, మంచి నీటి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు యూ.రాధిక, రవి, రామకృష్ణ, చంద్రశేఖర్ తదితరులు కోరారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar