ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసిన ప్రముఖ విరాళాధాత పారా చిట్టెన్న
తుగ్గలి/మద్దికేర న్యూస్ వెలుగు ప్రతినిధి: పత్తికొండ మండలంలోని పుచ్చకాయల మాడ గ్రామం నందు మంగళవారం రోజున ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయడానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను ,ప్రముఖ విరాళాధాత పారా చిట్టెన్న,ఉమ్మడి జిల్లాల మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకటరాముడు,పోతుల పురుషోత్తం చౌదరి,రాతన మనోహర్ చౌదరి,గిరిగెట్ల తిమ్మయ్య చౌదరి,టిడిపి యువ నాయకులు జొన్నగిరి మిద్దె వెంకటేశ్వర్లు యాదవ్ తదితర టిడిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను అందజేశారు. అనంతరం పత్తికొండ నియోజకవర్గం అభివృద్ధి కొరకు కృషి చేయాలని ముఖ్యమంత్రి కు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ నియోజకవర్గ శాసనసభ్యులు కేఈ శాంబాబు,కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!