అసైన్మెంట్ భూములకు రక్షణ కల్పించండి
క్రిష్ణగిరి మండలం తాసిల్దార్ బాధితులతో కలిసి వినతి పత్రం సమర్పించిన
ఎమ్మార్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొందిమడుగుల టిఎం రమేష్ మాదిగ,
క్రిష్ణగిరి, న్యూస్ వెలుగు; కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలం మాదాపురం గ్రామంలో సర్వే నెంబర్ 759/1a విస్తీర్ణం ఐదు ఎకరంల భూమి మాదిగ భాస్కర్ కు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా డి పట్టా మంజూరు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేసి రెవెన్యూ రికార్డుల నందు నమోదు చేశారు.ఈ భూమిని ఆధిపత్య కులానికి చెందినవారు ఆక్రమించుకొని దౌర్జన్యంతో సాగు చేస్తా ఉన్నారుఅక్రమార్కులను సాగు నుండి తొలగించి పట్టాదారులైన బాధితులకు తక్షణమే క్రిష్ణగిరి మండలం తాసిల్దార్ గారు మాదిగ భాస్కర్ కు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించిన భూమికి మండల సర్వేయర్ ద్వారా సర్వే చేయించి హద్దులు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కోరుతూ డిమాండ్‌తో కూడిన వినతి పత్రం సమర్పించడమైనది ఈ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాదాపురం గిడ్డయ్య మాదిగ బాధితురాలు మాధవి మాదిగ గిడ్డమ్మ మాదిగ తదితరులు పాల్గొన్నారు