తమ భూమిని కబ్జాదారుల నుంచి రక్షించండి

తమ భూమిని కబ్జాదారుల నుంచి రక్షించండి

నకిలీ దృవీకరణ పత్రాలతో దౌర్జన్యంగా కబ్జా

పోలం విడిచి పోవాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని  భాదితుల ఆందోళన

న్యూస్ వెలుగు, కర్నూలు; దిన్నె దేవరపాడు గ్రామం ఆ యాలో భుకబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠన చర్యలు తీసుకోవాలని భాదితులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. దిన్నెదేవర పాడు గ్రామంలోని సర్వే నెంబర్ 225లో రాముడు, ఈశ్వరయ్య లకు చెందిన భూమి ని కొందరు వ్యక్తులు నకిలీ దృవీకరణ పత్రాలతో దౌర్జన్యంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని భాదితులు ఆందోళన చేశారు. సుదర్శన్, జయన్న, ఎల్లమ్మ మరికొంత మంది తాము పోలంలో ఉండగా వచ్చి దౌర్జన్యం చేస్తున్నారని వారు ఆరోపించారు.ఎన్నో సంవత్సరాల నుంచి రాముడు కుటుంబ సభ్యులు సర్వే నెంబర్ 225 పొలంలో ఉండగా వీరు వచ్చి అసభ్యంగా మాట్లాడుతూ పోలం విడిచి పోవాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మహిళలు తెలిపారు. రబ్బరు స్టాంపులతో నకిలీ పట్టా తయారు చేశారని.. దీనిపై గతంలో పోలీసులకు, ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు. దౌర్జన్యకారుల నుంచి ప్రాణహాని ఉందని భాదితుడు శివ కుమార్ తెలిపారు.ఈకార్యక్రమంలో రాముడు, శిరిషా, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!