
రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి
నిర్మలమ్మ శ్రామిక మహిళా సంఘం జిల్లా నాయకులు
న్యూస్ వెలుగు, కర్నూలు; రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను అత్యాచారాలను అరికట్టాలి. మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఆర్ఎస్ రోడ్డు దగ్గర నిరసన చేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ కర్నూలు నగర కార్యదర్శి సాయి ఉదయ్ అధ్యక్షత వహించారు. శ్రామిక మహిళా సంఘం నాయకురాలు నిర్మలమ్మ, నాయక్ జిల్లా నాయకులు సుజాత, ఎస్ఎఫ్ఐ , డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శిలు అబ్దుల్లా, నాగేష్* ఎస్ఎఫ్ఐ నగర నాయకులు అబ్బు, భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకీ మహిళలపై విద్యార్థినిలపై దాడులు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కూటమి ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్తుంది ఆచరణలో ఏమాత్రం లేదు. మహిళలపై విద్యార్థులపై అత్యాచారాలు దాడులు జరగడానికి ముఖ్య కారణం మత్తు పదార్థాలు, మద్యం. రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులను ఎక్కడికక్కడ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం ద్వారా తాగేవారికి హద్దు లేకుండాతాగిన మైకంలో అత్యాచారాలు దాడులు చేస్తున్నారు.ఎక్కడా లేనంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ చాలా ఎక్కువగా ఎగుమతి అవడం జరుగుతుంది.మహిళలను దేవతల్లాగా పూజించే మనదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళ రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా హోం మంత్రి మహిళ కానీ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు. అదేవిధంగా విశాఖ లా విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. ప్రేమే ప్రధాన కారణంగా హత్యాచారం జరిగింది. ప్రేమ పేరుతో అమ్మాయిని మోసం చేసి లైంగికంగా వేధించి చిత్రహింసలు పెట్టాడు. అతను లైంగికంగా వేధించడమే కాకుండాతన మిత్రులతో కూడా అమ్మాయిని లైంగికంగా వేధించడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మహిళలకు, విద్యార్థినీలకు రక్షణ కల్పించాలని కోరారు. లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా మహిళలను కలుపుకొని మీకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. డివైఎఫ్ఐ నాయకులు సూరి, డివైఎఫ్ఐ న్యూ సిటీ నగర అధ్యక్షులు గౌతం విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.