
ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినీలకు రక్షణ కల్పించాలి; SFI
నూతన కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ కన్వీనర్ .కే సంయుక్త
న్యూస్ వెలుగు, కర్నూల్; భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా బాలికల కన్వెన్షన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో నగర నాయకులు పావని అధ్యక్షతన నిర్వహించారు. అనంతరం శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ నిర్మలమ్మ ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా బాలికల కన్వీనర్ కే సంయుక్త మాట్లాడుతూ రోజురోజుకీ ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోతుంది. ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులు విద్యార్థినీలను చదువుకోవడం కోసం పంపుతుంటే అంతలోనే విద్యాసంస్థల్లో విద్యార్థినీలపై లైంగిక దాడులు, హత్యాచారాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు విద్యార్థులని చదివించాలంటే భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వ విద్యాసంస్థల దగ్గర విద్యార్థినిలకు రక్షణగా వాచ్మెన్లను ఏర్పాటు చేయాలి. విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులు చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలి. వాచ్మెన్లను ఏర్పాటు చేయడం ద్వారా అల్లరి మూకల నుంచి విద్యార్థినీలకు రక్షణ కల్పించిన వాళ్ళు అవుతారు. విద్యార్థినీల అక్షరాస్యతను పెంచాలంటే విద్యార్థులకు రక్షణ కల్పించాలి. రక్షణ కల్పించకపోతే విద్యార్థినిల అక్షరశాతం తగ్గిపోతుంది అన్నారు. విద్యార్థినీలను చదువుకు దూరం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు జిల్లా బాలికల కన్వీనర్ గా సంయుక్త, కో-కన్వీనర్లుగా పావని, శ్రీ వాణి, మరియు కమిటీ సభ్యులు. పాల్గొన్నారు.