వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన

వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసన

Kadapa (జమ్మలమడుగు) న్యూస్ వెలుగు :  SC వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు  జిల్లా నాయకులు  పబ్బతి డేవిడ్ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ  రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కాదని , ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని 2005 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కొట్టివేసింది, బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎస్సీ వర్గీకరణ చేయాలని అలా వర్గీకరణ చేస్తే మాదిగ సామాజిక వర్గం ఓట్లను బిజెపి పార్టీకి ఓట్లు పడతాయని ఉద్దేశంతో బిజెపి రాజకీయ కుతంత్రాలు  స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.  శ్రీ చంద్రచుడ్ జస్టిస్ ఆధ్వర్యంలో ఏడుగురు కమిటీ సభ్యులతో ఎస్సీ వర్గీకరణ అనేది ఎలా తేల్చుతారని ప్రశ్నించారు.

భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారం క్లాజ్ వన్ లో ఎస్సీ జాబితాలో ఉండే కులాలకు ఎక్కువ తక్కువ అని వేరు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని తెలియజేసింది.  బీహార్ రాష్ట్రంలో ఈ బీసీ కులంలో ఉన్నటువంటి తంతి తత్వ అనే సామాజిక వర్గం ఉపకులం, ఎస్సీ జాబితాలో ఉన్నటువంటి సావాసి అనే షెడ్యూల్ కులంలో తంతి తత్వ అనే సామాజిక వర్గాన్ని షెడ్యూల్ కులాల్లో కలిపేసినట్లు  బీహార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు.

2015 సంవత్సరంలో జస్టిస్ శ్రీ విక్రమ్నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ మిశ్రా తో కూడిన ధర్మాసనం స్పష్టంగా బీహార్ ప్రభుత్వానికి తెలియజేసింది , భారత రాజ్యాంగం ఆర్టికల్ 341 ప్రకారం క్లాజ్ వన్ లో ఉన్నటువంటి ఎస్సీ జాబితా కులాల్లో ఎక్కువ తక్కువ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎటువంటి అధికారం లేదని అత్యున్నత  న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పు తెలియజేసిందన్నారు.  గతంలో ఇచ్చినటువంటి  తీర్పులను పరిగణలోనికి తీసుకోకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం అత్యవసరంగా కమిటీలు వేసి మాల మాదిగలను కానీ మిగతా 59 ఉపకులాలు కానీ దేశంలో ఉండే 1126 ఉపకులాలు కానీ ఎస్సీ వర్గీకరణను  రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పజెప్పడం భారత రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతామని మాలమహానాడు నాయకు అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కన్వీనర్ చింతల దానమ్మ, జిల్లా అధ్యక్షుడు పబ్బతి డేవిడ్ , శాస్త్రి లక్ష్మయ్య మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా అధ్యక్షుడు జ్యేష్టాది భాస్కర్, జిల్లా మాల మహానాడు తప్పేట లాజర్, రత్నరాజు ,జీకే జ్యోతి, సురేష్ శరత్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!