విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలని లాంతర్లతో నిరసన

విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలని లాంతర్లతో నిరసన

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ

కర్నూలు, న్యూస్ వెలుగు;  పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలని కోరుచూ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 8వ తేదీ లాంతర్లతో నిరసన కార్యక్రమం జరుగుతుందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు పీ మురళీకృష్ణ గారు తెలియజేశారు. బుధవారం కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మురళీకృష్ణ గారు మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల అమలుతో పాటు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీని నిలబెట్టుకోవాలని కానీ అలా చేయకుండా సర్దుబాటు చార్జీల రూపంలో ప్రజలపై భారం వేయుచున్నారని వాటిని వెంటనే విరమించు కోవాలని కోరుచూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలా రెడ్డి గారి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 8-11-2024 వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుచూ కర్నూలు నగరము నందలి కొత్త బస్టాండ్ ఎదురుగా ఎస్ ఏ పి క్యాంప్ పక్కన గల విద్యుత్ ఎస్ ఈ కార్యాలయం ముందు లాంతర్లతో నిరసన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమమునకు కర్నూలు జిల్లా నందలి కాంగ్రెస్ నాయకులు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కర్నూలు సిటీ కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ సంఘాలైన మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఐ ఎన్ టి యు సి, ఎన్ ఎస్ యు ఐ, సేవాదళ్, యూత్ కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సెల్, డాక్టర్ సెల్, కిసాన్ సెల్, లీగల్ సెల్, సాంస్కృతిక విభాగం, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నిరసన కార్యక్రమమును విజయవంతం చేయవలసినదిగా మురళీకృష్ణ గారు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS