గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించండి
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, న్యూస్ వెలుగు: గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా వైద్యాధికారులను ఆదేశించారు.మంగళవారం ఆదోని ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రిని ఆకస్మితక తనిఖీ చేసి, రోగులకు వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ తొలుత ఓపి వార్డును, పిపిటిసి గది , యాంటినేటల్ వార్డు, రిజిస్ట్రేషన్ నమోదు కేంద్రము, నవజాత శిశువు సంరక్షణ విభాగము, పొస్ట్ ఆపరేటివ్ వార్డు -1 , మెడికల్ రికార్డు రూమ్, గైనకాలజీ వార్డులను తనిఖీ చేశారు..గైనకాలజీ వార్డును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న గర్భిణీ స్త్రీ భూమిక తో కలెక్టర్ మాట్లాడారు…డాక్టర్లు వైద్య సేవలు ఎలా అందిస్తున్నారు? సరైన సమయానికి మందులు ఇస్తున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు..ఆదోని మాతా శిశు ఆస్పత్రిలో ఇప్పటికే 12 మంది సిబ్బంది ఉన్నారని, గర్భిణీ స్త్రీలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను అదనంగా 8 మంది స్టాఫ్ నర్సులను డిప్యుటేషన్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు…వీరి ద్వారా షిఫ్ట్ పద్ధతిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ టేబుల్ అవసరం ఉందని డిసిహెచ్ఎస్ కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా సిఎస్ ఆర్ నిధులతో ఏర్పాటు చేయాలని కలెక్టర్ డిసిహెచ్ఎస్ ను ఆదేశించారు..ఆసుపత్రిలో పెచ్చులు ఉన్న గోడలను మరమ్మతులకు సంబంధించి ఎస్టిమేషన్ రూపొందించాలని కలెక్టర్ డిసిహెచ్ఎస్ ను ఆదేశించారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డి సి హెచ్ ఎస్ మాధవి, ఆసుపత్రి సూపరీoటెండెంట్ మాధవి లత తదితరులు పాల్గొన్నారు.