
రాయలసీమలో సాగునీరు అందించండి : కొత్తూరు సత్యం
కర్నూలు, న్యూస్ వెలుగు; రాయలసీమ ప్రాంతంలో సాగునీరు అందించేందుకు పాలకులు నిర్లక్ష్యం వహించడం మానుకోవాలని రాయలసీమ రాష్ట్ర ఉద్యమ నాయకులు కొత్తూరు సత్యనారాయణ గుప్త ఆవేదన వ్యక్తం చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో ఉన్న జిల్లాలో ఉపాధి లేక పలసలకు పోతున్నారని విభజన హామీలను నెరవేర్చడంలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు ఆంధ్ర ప్రాంతానికి రావాల్సిన వాటా తెలంగాణ నుంచి రాకపోవడం పై ఎవరు నోరు మెదపడం లేదన్నారు . సంక్రాంతి కారణంగా సుమారు 5 లక్షల మంది హైదరాబాదు నుండి ఇప్పటికైనా పాలకులు ఆలోచన చేసి ప్రాంతాలవారీగా అభివృద్ధి చేస్తే ఎక్కడి వారు అక్కడ జీవనం సాగిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాలు పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. సంక్రాంతి పండుగ కారణంగా హైదరాబాద్ నగరం తో పాటు మిగతా తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రాంతం వారు లేకపోవడంతో బోసిపోతున్నాయని అభిప్రాయం కూడా ఉందన్నారు . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. తెలంగాణలో వలసలకు వెళ్తుంటే తెలంగాణ ప్రాంతం వాళ్లు ఇతర ప్రాంతాలకు వలసలకు పోతున్నారని ఇది విడ్డూరం కాదా అని ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రాంతం బంగారు సిరులు పండించే ప్రాంతంగా మారుస్తామని రతనాలసీమగా మారుస్తామని మాటల్లో తప్ప చేతుల్లో లేదన్నారు. ఇకనైనా పాలకులు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు .