
20వేల ఎకరాలకు సాగునీరు అందించండి : ఏపీ రైతు సంఘం
పత్తికొండ న్యూస్ వెలుగు : రైతులకు తాగు ,సాగునీరు అందించాలని ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టినట్లు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మయ్య తెలిపారు. ఈనెల 28న గ్రామ సచివాలయం ఎదుట జరిగే ధర్నా కార్యక్రమంలో పార్టీలకతీతంగా రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పెద్ద ఈరన్న, రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి, ఏంగిల్స్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడమ కాలువను పొడిగించి సాగు, తాగునీరు అందించాలి…
దేవనబండ లో సంతకాల సేకరణ చేస్తున్న సిపిఐ, ఏపీ రైతు సంఘం నాయకులు