గడియారం హాస్పిటల్లో వసతులు కల్పించండి
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పి మురళీకృష్ణ
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు నగరం నందలి గడియారం హాస్పిటల్ నందు వసతులు కల్పించాలని కోరుచూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టిటిడి పాలకమండలి బోర్డు మాజీ సభ్యులు పి మురళీకృష్ణ డిమాండ్ చేశారు. శనివారం ఉదయం నగర కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష తో కలిసి కర్నూల్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గల కమిషనర్ ఎస్ రవీంద్రబాబు గారికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మురళీకృష్ణ మాట్లాడుతూ కర్నూలు నగరం నందు ఎంతో ఘన చరిత్ర కలిగిన గడియారం హాస్పిటల్లో గతంలో కొన్ని వందల డెలివరీలు జరుగుతుండేవని కాలక్రమేనా అక్కడ వైద్యులు, సిబ్బంది, వసతులు లేక డెలివరీ కేసులు తగ్గుతూ వస్తున్నాయని దీనికి కారణం వైద్యులు సిబ్బంది సదుపాయముల కొరత అని తెలియు చున్నదన్నారు. కనుక తక్షణమే ఒక గైనకాలజిస్టును, ఒక పీడియాట్రిస్టును, ఒక జనరల్ ఫిజీషియన్ ను, సిబ్బందిని మరియు వసతులను తక్షణమే కల్పించవలసిందిగా కోరుచున్నామని ఇవన్నీ మీరు కల్పిస్తే గడియారం హాస్పిటల్ కు పూర్వ వైభవం తెచ్చిన వారు అవుతారని మురళీకృష్ణ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష, ఎస్సీ సెల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు ఎన్ సి బజారన్న, డిసిసి మాజీ ఉపాధ్యక్షులు షేక్ రియాజుద్దీన్, జిల్లా ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు ఈ లాజరస్, సిటీ మైనార్టీ సెల్ మాజీ చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, డిసిసి మాజీ కార్యదర్శులు బి సుబ్రహ్మణ్యం, షేక్ ఎజాస్ అహ్మద్, పశుపల ప్రతాపరెడ్డి, రమేష్ మొదలగువారు పాల్గొన్నారు.