
శ్రీ వీరాంజనేయ స్వామికి మంగళవారం పూజలు
న్యూస్ వెలుగు, ఒంటిమిట్ట; రెండవ అయోధ్య ఆంధ్ర భద్రాచలం ఏకశిలానగరంగా పేరు ప్రఖ్యాతులు గడిచిన ఒంటిమిట్ట క్షేత్రంలో అతి పురాతనంగా చెరువు కట్టపై వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామికి ఆలయ అర్చకులు ఏలేశ్వరం .బాలగునాధ శర్మ( బాలు స్వామి) ఉభయ దారుల నేతృత్వంలో ఆకుపూజ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ మహా గణపతి పూజ, శ్రీ సూక్తం, పురుష సూక్త ప్రకారంగా శ్రీ వీరాంజనేయ స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె ,చక్కెరతో కలగలిపిన పంచామృత అభిషేకములు నిర్వహించి నూతన వస్త్రాలతో వివిధ రకాల పుష్పాలంకరణలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారిని తమలపాకులతో సహస్రనామ, అష్టోత్తరాలతో కీర్తించి మహా నివేదన, మంగళ హారతి, మంత్రపుష్ప పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా శుక్రవారం 10వ తేదీన వైకుంఠ ఏకాదశి ఏకాదశి పర్వదిన సందర్భంగా మామిడి తోరణాలతో, అరటి పిలకలతో దేవాలయ అలంకరణ నిర్వహించి ప్రాతఃకాలంలో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, నూతన వస్త్రధారణ, పలు రకాల పుష్పాలంకరణ, భక్తులకు స్వామివారి దర్శన భాగ్య ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్లు మండల పురోహితులు, శ్రీ కోదండ రామస్వామి ఆలయ ఆస్థాన పురోహితుడు, వీరాంజనేయ స్వామి ఆలయ అర్చకులు అయిన ఏలేశ్వరం .గురుస్వామి శర్మ ఈ సందర్భంగా తెలియజేశారు.