శ్రీ మాళ మల్లేశ్వర స్వామికి పూజలు
హోళగుంద,న్యూస్ వెలుగు: మండల పరిధిలో దేవరగట్టు కొండ ప్రాంతంలో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వర స్వామి దేవాలయంల్లో ఆదివారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.అలాగే అర్చకులు మల్లయ్య స్వామి,మహేష్ స్వామి ఉదయం నుంచి స్వామివారి సన్నిధిలో జలాభిషేకం,బిల్వార్చన,పంచామృతాభిషేకం,బిల్వార్చన,ఆకుపూజ,దేవుడిని పెద్ద ఎత్తున పూలమాలలతో అలంకరించారు.అలాగే మహిళ భక్తులు ప్రతి మెట్టుకు కుంకుమ బండారు అంటిస్తూ గిరి పైకి చేరుకుని అనుకున్న మొక్కుబడులు తీర్చుకున్నారు.మరియు దేవాలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
Was this helpful?
Thanks for your feedback!