పుంగనూరు బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం : చంద్రబాబు

పుంగనూరు బాలిక కుటుంబానికి న్యాయం చేస్తాం : చంద్రబాబు

అమరావతి : చిత్తూరు జిల్లా పుంగనూరు  లో హత్యకు గురైన బాలిక కుటుంబానికి న్యాయం చేసి ఆదుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. బాలిక కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ఉండాలని సూచించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత , మంత్రులు ఫరూఖ్‌, రాంప్రసాద్‌రెడ్డి ఆదివారం నాడు పుంగనూరులో బాలిక కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా బాలిక కుటుంబ సభ్యులు చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. ఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ సెప్టెంబర్‌ 29న బాలిక అదృశ్యం కాగా అదే రోజు రాత్రి 11 గంటలకు ఫిర్యాదు చేశారని తెలిపారు. బాలిక అచూకి కోసం ఎస్పీ వెంటనే 11 బృందాలను ఏర్పాటు చేశారని వివరించారు.

మూడు రోజుల తర్వాత బాలిక మృతదేహం లభ్యమైందని తెలిపారు. డాక్టర్‌ల ప్రాథమిక నివేదిక ఆధారంగా బాలికపై అత్యాచారం జరుగ లేదన్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారని వివరించారు. అయితే ఘటనపై జగన్‌ రాజకీయం చేయడం సరికాదని అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!