సత్వరమే సమస్యలను పరిష్కరించండి

Puttaparthi  (పుట్టపర్తి  క్రైం):  జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో  పుట్టపర్తి, దిశా, డిఎస్పీలు వాసుదేవన్ ,శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.  ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.

సోమవారం జరిగిన  ఈ కర్యక్రమంలో 38 , ఫిర్యాదులను  స్వీకరించి, వాటిని  సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. భార్యాభర్తల గొడవలు, కుటుంబ కలహాలు, భూ సమస్యలు,ఆస్తి తగాదాలు ,సైబర్ నేరాలు వంటి వాటిపై బాధితుల నుండి  ఫిర్యాదులు స్వీకరించినట్లు మీడియాకు వెల్లడించారు .  ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వాసుదేవన్, శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ సాయినాథ్ రెడ్డి, సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!