అద్దెలు చెల్లించకుంటే ఆందోళన చేస్తాం ..
Puttaparthi (పుట్టపర్తి ): సార్వత్రిక ఎన్నికల సమయంలో పుట్టపర్తి మండల తాహశీల్దార్ కార్యాలయ అధికారులు వాహనాలను ఉపయోగించుకొని అద్దెలు చెల్లించకుండా వేధిస్తున్నారంటూ వాహన యజమానులు కార్యాలయం ముందు ఆందోళన చేశారు. ఎన్నికల సమయంలో 26 వాహనాలను12 రోజులపాటు ఉపయోగించుకుని అద్దెలు చెల్లించలేదన్నారు. ఎన్నికలు ముగిసిదాదాపు రెండు నెలలు అవుతున్న అద్దెలు చెల్లించకుండా అధికారులు కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని మండిపడ్డారు. దీంతో సోమవారం తాహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగగా … ఒక్కొక్క వాహనానికి24వేల రూపాయలు చొప్పున 26 వాహనాలకు 6లక్షల 24 వేలరూపాయలు అధికారులు చెల్లించాల్సి ఉండగా, అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ .. కాలం వెళ్లతీస్తున్నారన్నారు. బిల్లులకోసం తాహశీల్దార్ వద్దకు వెళితే ఆర్డీవో వద్దకు వెళ్లాలని, ఆర్డీవో వద్దకు వెళితే కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారని, ఈవిషయంపై గతంలో కలెక్టర్ అరుణ్ బాబుకు ఫిర్యాదుచేస్తే తాహశీల్దార్ వద్దకు వెళితే బిల్లులు చెల్లిస్తారని చెప్పారన్నారు. బిల్లులు మంజూరు కాకుండానే కలెక్టర్ బదిలీ అయివెళ్లిపోయారన్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో తాము వాహనాలకు కంతులు ఎలా చెల్లించాలని యజమానులు అధికారులను ప్రశ్నించారు. మరో రెండు రోజులలోపు అద్దెలు చెల్లించకపోతే ఆందోళనకు దిగాల్సివస్తుందని వాహన యజమానులు అధికారులను హెచ్చరించారు.