
సామాజిక తనిఖీ కొరకు రబీ ముసాయిదా జాబితా ప్రదర్శన
తుగ్గలి,మద్దికేర మండల వ్యవసాయ అధికారులు పవన్,రవి.
తుగ్గలి/మద్దికేర వెలుగు న్యూస్ ప్రతినిధి: సామాజిక తనిఖీ కొరకు ఈ-పంట నమోదు రబీ 2024-25 సంవత్సరానికి సంబంధించి రైతుల ముసాయిదా జాబితాను ప్రదర్శిస్తున్నట్లు తుగ్గలి మరియు మద్దికేర మండల వ్యవసాయ అధికారులు పవన్ కుమార్,రవి లు తెలియజేశారు.గురువారం రోజున తుగ్గలి మండల పరిధిలోని గల పెండేకల్లు గ్రామంలో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ రబీ 2024-25 సీజన్ నందు 9626 ఎకరాలలో 3158 మంది రైతులకు రెవెన్యూ శాఖ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ పంట నమోదు పూర్తి చేసామని,మండల పరిధిలోని గల అన్ని గ్రామాలలోని రైతు సేవా కేంద్రాలలో పంట నమోదు ముసాయిదా జాబితాను సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శించినట్లు ఏవో తెలియజేశారు.గురువారం రోజున పెండేకల్లు గ్రామంలో రబీ జాబితాను వీఆర్వో తిమ్మయ్య, గ్రామ సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో జాబితాను ప్రదర్శించారు.11వ తేదీ నుండి 21 తేదీ వరకు సామాజిక తనిఖీ కొరకు గ్రామసభలు నిర్వహించబడతాయని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే 21 లోపు రాతపూర్వకంగా వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా మద్దికేర మండల వ్యవసాయ అధికారి రవి మాట్లాడుతూ రబీ 2024-25 సీజన్ నందు 19798 ఎకరాలలో 4907 మంది రైతులకు రెవెన్యూ శాఖ మరియు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ పంట నమోదు పూర్తి చేసామని,మండల పరిధిలోని గల అన్ని గ్రామాలలోని రైతు సేవా కేంద్రాలలో పంట నమోదు ముసాయిదా జాబితాను సామాజిక తనిఖీ కొరకు ప్రదర్శించినట్లు ఏవో తెలియజేశారు.మార్చి 11వ తేదీ నుండి 21 తేదీ వరకు సామాజిక తనిఖీ కొరకు గ్రామసభలు నిర్వహించబడతాయని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే 21 లోపు రాతపూర్వకంగా వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాలని మండల వ్యవసాయ అధికారి రవి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు,వ్యవసాయ శాఖ అధికారులు,సచివాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.


 Journalist Pinjari Imamulu
 Journalist Pinjari Imamulu