లహరి మరణానికి కారణమైన ప్రేమోన్మాది రాఘవేంద్ర ను కఠినంగా శిక్షించాలి

లహరి మరణానికి కారణమైన ప్రేమోన్మాది రాఘవేంద్ర ను కఠినంగా శిక్షించాలి

     ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య 

న్యూస్ వెలుగు, నంద్యాల క్రైం ; నంద్యాల జిల్లా,నందికొట్కూరు పట్టణం, బైరెడ్డి నగర్ లో విద్యార్థి లహరి ప్రాణాలు తీసిన ప్రేమోన్మాది రాఘవేంద్రను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కర్నూలు జిల్లా సమితి డిమాండ్ చేసింది. శుక్రవారంనాడు స్థానిక సిఆర్ భవన్ నందు నగర అధ్యక్షురాలు నాగేంద్రమ్మ అధ్యక్షతన నగరం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గిడ్డమ్మ, శ్రావణి,నగర కార్యదర్శి భారతీలు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో దేశంలో మహిళలపై అత్యాచారాలు,ప్రేమ పేరుతో దాడులు విపరీతంగా పెరిగిపోయాయని వీటిని కట్టడి చేయడంలో పాలకులు పూర్తిగా వైపల్యం చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ముచ్చుమరి గ్రామంలో బాలిక అదృశ్య మిస్టరీ చేదించక ముందే నాగటూరు గ్రామంలో ఒక సంఘటన,నేడు నందికొట్కూరు బైరెడ్డి నగర్ లో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ప్రేమోన్మాది పెట్రోల్ పోసి తగలపెట్టిన సంఘటన మానవ లోకానికి తీరని మచ్చని వారు ఆవేదన చెందారు.నేటి సమాజంలో సోషల్ మీడియా,సినిమాల్లో వస్తున్న అశ్లీలత చిన్నపిల్లల నుండి సెల్ ఫోన్లు విపరీతంగా చూడడం కారణంగా విద్యార్థులు యువకులు చెడుదారిన పడుతున్నారని, దానికి తోడు రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు గంజాయి విపరీతంగా మద్యం అమ్మకాలు అందుబాటులో ఉండడంతో యువత చెడిపోయి,అదే నిజమని భ్రమలో బ్రతుకుతూ అనేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిని పోలీసులు అరికట్టాలని వారి డిమాండ్ చేశారు.పాలకులు,పోలీసులు సంఘటన జరిగినప్పుడు స్పందించడం,ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచి చేతులు దులుపుకుంటున్నారని,ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా త్వరితగతిన విచారణ చేపట్టి, ముద్దాయిలని కఠినంగా శిక్షించినప్పుడే మరొకరు ఇలాంటి తప్పు చేయాలంటే భయపడతారని అన్నారు.కావున పోలీస్ చర్యలు ఆవైపున ఉండాలని వారి డిమాండ్ చేశారు.సమాజంలో మనుషులకు నైతిక విలువలు పెంపొందించడం కోసం,సామాజిక కార్యక్రమాలు ప్రభుత్వం రూపొందించి మానవ ప్రవర్తనలో మార్పు తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. బాధితురాలు లహరి కుటుంబాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి సందర్శించి వారికి ధైర్యం చెప్పడంతో పాటు వారి కుటుంబానికి రూ.50లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నగర నాయకురాలు పావని,రేణుక,మునెమ్మ,ఆశ బేగి,సోఫియా,తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!