మోడీ విదానలకు వ్యతిరేకంగా ర్యాలీ

మోడీ విదానలకు వ్యతిరేకంగా ర్యాలీ

Bethamcherla News Velugu :  బేతంచర్ల పట్టణంలోని భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, మాలమహానాడు, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని పూలమాలవేసి నివాళులర్పించిన  అనంతరం స్కూటర్ ర్యాలీని నిర్వహించినట్లు  పట్టణ పురవీధుల గుండా అంబేద్కర్ విగ్రహం నుండి కొలనుపల్లె సత్రం మీదుగా పొట్టారెడ్డికల్యాణశాల, అంగళ్ళ బజారు, పాత ఎమ్మార్వో ఆఫీస్, జండా మసీదు, పూల అంగళ్ల దగ్గర పాత బస్టాండ్ లోకి చేరుకొని నిరసన వ్యక్తం చేసినట్లు  సీపీఐ మండల కార్యదర్శి భార్గవ్ తెలిపారు.  దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాజ్యాంగ హక్కులపై దాడి చేస్తూ, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ మతాల మధ్య చిచ్చు పెడుతూ మైనార్టీల మీద దాడులు చేస్తూన్నారని ఆరోపించారు.  హక్కులను కాలరాస్తూ, సామాన్య ప్రజానీకంపై అనేక భారాలు మోపుతున్న మోడీ పాలన కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశామన్నారు.  దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏవర్గ ప్రజానీకానికి మేలు చేయలేదని కేవలం సిబిఐ, ఈడి, ఐటి, లాంటి సంస్థల ను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష రాజకీయ నాయకులను బ్లాక్ మెయిల్ చేసి తమ పట్టు నిలుపుకోవడం, మైనార్టీలపై దాడి చేయడం, హక్కులను కాలరాయడం ప్రభుత్వ సంస్థలను మోడీ మిత్రుడు అదానికి అమ్మడం తప్ప ఎలాంటి ఉపయోగం లేదన్నారు.  న్యాయవ్యవస్థను, ఎన్నికల సంఘాన్ని స్వయం ప్రతిపత్తిని బలహీనపరిచి దుర్మార్గమైన చర్యలకు పాల్పడడం, లౌకిక వ్యవస్థను నిర్వీర్యం చేయడం, విద్యారంగంలో ఆర్ఎస్ఎస్ భావజాలం చేర్చడం, చరిత్రను వక్రీకరించడం, లాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.  ప్రజల పై నిత్యం ధరలు పెంచడం వంటగ్యాస్ పైన ఒకేసారి 50 రూపాయలు పెంచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.  ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని జీఎస్టీ భారలు మోపి ఉన్న ఉద్యోగులను తీసేసారన్నారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు నిధులు, కేటాయించాలని నూతన పరిశ్రమల ఏర్పాటు ఏమీ లేవని విమర్శించారు . కార్యక్రమాలలో సిపిఐ మండల సహాయ కార్యదర్శులు తాలూకా తిరుమలేష్, దస్తగిరి, పట్టణ కార్యదర్శి నాగరాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్, మాల మహానాడు నాయకులు బొల్లి మద్దిలేటి, మునిస్వామి, యన్నా రమేష్, రామసుబ్బయ్య, రంగన్న, రవి, సునీల్, ఎల్లమధు, సీపీఐ, ఏఐఎస్ఎఫ్,ఏఐవైఎఫ్ మండల నాయకులు శ్రీకర్, ఎల్లకృష్ణ, నాగేంద్ర, ధనుంజయ, సాయి, రాజవంశీ, రాజేష, ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు

Author

Was this helpful?

Thanks for your feedback!