
రామాయణం జగతికి ఆదర్శం
న్యూస్ వెలుగు, కర్నూలు; సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపించడానికి, మానవత్వపు పరిమళాలు వెదజల్లే శ్రీమద్రామాయణం ఈ జాతి ఉన్నంతవరకు ఆదర్శంగానే నిలుస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పత్తికొండ పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ధార్మిక కార్యక్రమాల ప్రారంభోత్సవ సందర్బంగా వారు ప్రారంభోపన్యాసం చేశారు. తదనంతరం ప్రముఖ రంగస్థల కళాకారుడు పాయసం పెద్ద రంగారెడ్డి చేసిన సంగీత భరిత ధార్మిక ప్రవచనం భక్తులను ఎంతగానో అలరించినది. ఈ కార్యక్రమంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అమరావతి శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ ప్రఖండ అద్యక్షులు వీరరాజు, ఆర్ ఎస్ ఎస్ ప్రముఖ్ రామలింగయ్య, తెలుగు పండితులు బి.రాజా జయచంద్రన్, జి.వేంకటేశ్వర్లు, విష్ణు సహస్రనామ బృందం అధ్యక్షులు విజయలక్ష్మీ , కురువ గిడ్డయ్యతో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు.


 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar