
హ్యూమన్ రైట్స్ నియోజకవర్గ మహిళా చైర్మన్ గా రాణెమ్మ ఎంపిక
జమ్మలమడుగు టౌన్, న్యూస్ వెలుగు; జమ్మలమడుగు పట్టణంకు చెందిన అన్నపురెడ్డి రాణమ్మకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ఇండియా జమ్మలమడుగు నియోజకవర్గ మహిళా చైర్మన్ గా హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు తాళ్లూరి ప్రసన్నకుమార్ నియమించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా రాణమ్మ మాట్లాడుతూ జమ్మలమడుగు నియోజక వర్గంలోని మరియు జిల్లాలో, రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న దాడులు అణగారిన వర్గాల ప్రజలకు జరిగే ఇబ్బందులకు వారి తరఫున. నిలిచి హ్యూమన్ రైట్స్ ద్వారా సంబంధిత అధికారులు, నాయకులతో పోరాడి వారికి న్యాయం చేస్తానని తెలిపారు. అలాగే స్కూలు, కాలేజీలలో చదువు కునే విద్యార్థులపైజరుగుతున్న అఘాయిత్యాలపై రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి బాధితులకు న్యాయం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గ మహిళా చైర్మన్ గా నాపై నమ్మకంతో నన్ను ఎంపిక చేసినందుకు రాష్ట్ర కమిటీ నాయకులు అన్నబోయిన గురుమూర్తి యాదవ్, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తమాస్ భాస్కర్ బాబు, సీనియర్ న్యాయవాది కుంటుమల్ల రామ మోహన్, ఎస్సీ సెల్ చైర్మన్ దారా ఓబులేసులకు కృతజ్ఞతలు తెలిపారు.


 Ponnathota Jayachandra
 Ponnathota Jayachandra