
వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారాన భక్తులకు దర్శనమిచ్చిన రంగనాథుడు
భక్తులతో కిటికీటలాడిన రంగనాథ స్వామి దేవాలయం
మద్దికేర, న్యూస్ వెలుగు ప్రతినిధి: వైకుంఠ ఏకాదశి రోజున మండల పరిధిలోని పెరవలి గ్రామం నందు వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారు ఉత్తర ద్వారం నందు భక్తులకు దర్శనమిచ్చారు.వేకువ జామున స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించి గరుడ వాహనంపై ఉంచి ఉత్తర రాజగోపురము నందు ఆయన భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులతో పెరవలి రంగనాథ స్వామి దేవాలయం కిటకిటలాడింది.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి వీరయ్య అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశారు.పెరవలి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంనకు 248 గ్రాములు వెండి ప్లేటు విరాళముగా శ్రీ స్వామివారి భక్తులు కీర్తిశేషులు పార చంద్రన్న భార్య పారా సువర్ణమ్మ వీరి కుమారుడు కోడలు పారా రవికుమార్ శ్రీమతి పారా సరిత మరియు మనవళ్లు శశాంక్,ఆదిత్య లు ఆలయ కార్య నిర్వహణ అధికారి వీరయ్యకు అందజేశారు.ఈ కార్యక్రమంలో అర్చకులు, పారా చిట్టెన్న,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.