రాయలసీమ వర్సిటీ వి.సిగా ఆచార్య వి. వెంకట బసవరావు బాధ్యతలు

రాయలసీమ వర్సిటీ వి.సిగా ఆచార్య వి. వెంకట బసవరావు బాధ్యతలు

కర్నూలు , న్యూస్ వెలుగు;   ఆచార్య బసవరావును వర్సిటీ వి.సిగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం GO MS No. 8ని నిన్న విడుదల చేసింది. ఆచార్య బసవరావు ఇంతకుపూర్వం హైదరాబాదులోని ఉస్మానియా యూవర్సిటీ కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా విధులు నిర్వహించి 2024 జులైనెలలో పదవీవిరమణ చేశారు. వి.సి.గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వర్సిటీలో ఆచార్యులు, అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో ఆచార్య బసవరావు మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాయలసీమ విశ్వవిద్యాలయ వి.సిగా నియమించిన రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యాశాఖామంత్రి నారా లోకేష్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాబోయే మూడేళ్ల కాలంలో విశ్వవిద్యాలయ అభివృద్ధికి పారదర్శకంగా ఉంటూ, శక్తివంచనలేకుండా కృషిచేస్తానని హామీఇచ్చారు. అకడమిక్ క్యాలండర్ని తప్పనిసరిగా పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థుల సహకారంతో వర్సిటీ అభివృద్ధికి తగిన ప్రణాళికలు రచించాలని సూచించారు. వర్సిటీ వెబ్సైట్లో మరింత సమాచారాన్ని పొందుపరచాలన్నారు. వర్సిటీ వి.సిగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య వి. వెంకట బసవరావును వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బి. విజయ్ కుమార్ నాయుడు, CDC డీన్ ఆచార్య సి.వి. కృష్ణారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య ఎస్. నరసింహులు, డీన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య పి.వి. సుందరానంద్, రీసర్స్ డైరెక్టర్ ఆచార్య సి. విశ్వనాథరెడ్డి, డీన్ ఆఫ్ అకడమిక్ అఫైర్స్ ఆచార్య ఆర్. భరత్కుమార్, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై. హరిప్రసాద్ రెడ్డితోపాటు, వర్సిటీలోని వివిధ విభాగాల అధ్యాపకులు, అధికారులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, అనుబంధ కాలేజీల ప్రతినిధులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!