
నేడు నగరపాలకలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
కర్నూలు, న్యూస్ వెలుగు; నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఎస్.రవీంద్రబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలకు తమ కాలనీల్లో ఏవైనా స్థానిక సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు. ఉదయం 10 గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని, అన్ని విభాగాల అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist Sekur Gangadhar
 Journalist Sekur Gangadhar