
కూటమి గెలుపు కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించండి…
వైసిపి నాయకులకు ఏ స్థాయిలో పనిచేసిన ఊరుకోము…
కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం…
హోళగుంద, న్యూస్ వెలుగు;  కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి కష్టపడిన ప్రతి కార్యకర్తలను గుర్తించాలని వైఎస్ఆర్సిపి నాయకులను పార్టీలో చేర్చుకుంటామంటే ఒప్పుకోము అని కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు అన్నారు. సిద్దేశ్వరం రైస్ మిల్లులో  సోమవారం  కూటమి పార్టీల నాయకులు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం హోళగుంద మండల కేంద్రం నందు కూటమి పార్టీల నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య, జనసేన కన్వీనర్ అశోక్, తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ వీరన్న గౌడ్ మాట్లాడుతూ మండలంలో కూటమి అధికారం కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలను గుర్తించడం లేదని వైఎస్ఆర్సిపి నాయకుల కోసం పనిచేస్తున్నారు కానీ కూటమి అధికారం కోసం కృషిచేసిన కార్యకర్తలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఉండే వ్యక్తులు ఇక్కడ రాజకీయం చేస్తామంటే కుదరదని, స్థానిక నాయకులు కార్యకర్తలతో చర్చించి పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ఇప్పటికైనా కూటమి అధికారం కోసం పనిచేసిన నాయకులను కార్యకర్తలను గుర్తించి ఏ పార్టీ కార్యక్రమమైన అందరితో చర్చించి నిర్ణయించాలని అన్నారు. ఒంటెద్దు పోకడలను మానుకోవాలని, ఇలాగే కొనసాగితే సహించేది లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda