
సచివాలయ పని భారం తగ్గించండి
గ్రామ పంచాయతీ సిబ్బంది గానే గుర్తించండి
ఎంపిడిఓ కి వినతిపత్రం అందజేసిన పంచాయతీ కార్యదర్శులు
బండి ఆత్మకూరు, న్యూస్ వెలుగు: సచివాలయంలో పనిచేసే సిబ్బంది లాగానే తమను కూడా ఓ సిబ్బందిలా చూడాలని బండి ఆత్మకూరు మండల పంచాయతీ కార్యదర్శులను కోరారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీవో దస్తగిరి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చూడాలని తమను గ్రామపంచాయతీ సిబ్బంది గానే గుర్తించాలని, తమ మాతృ శాఖ ఆదేశాల మేరకు గ్రామపంచాయతీ పరిపాలన చేస్తున్నామన్నారు.ప్రభుత్వ ఆదేశాలనుసారం చేపడుతున్న వివిధ సర్వేలు, పనులను, సచివాలయ సిబ్బందికి కేటాయించినట్లే పంచాయతీ కార్యదర్శులకు కేటాయించాలని కోరారు. గ్రామ సచివాలయం ద్వారా చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు,సర్వేలు ,రిపోర్టులలో,సిబ్బంది అలసత్వం పై పంచాయతీ కార్యదర్శులును బాధ్యులుగా చేయకుండా ఉండాలాగ పంచాయతీ కార్యదర్శిని కూడా సచివాలయంలో ఒక సిబ్బంది గానే చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్సులు సుబ్బారావు,వెంకట రాముడు,అక్బర్,బాలకృష్ణ, చౌడయ్య,సుజాత,జ్యోతి, పీ యస్ -5 లు చక్రధర్,శ్రీకాంత్,లక్ష్మీదేవి,చంద్ర నాయక్ లు పాల్గోన్నారు.