
ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవాలి
ఏపీ డీజీపీ, ఏపీఎస్ఆర్టీసీ వి.సీ అండ్ ఎండి ద్వారక తిరుమల రావు
కర్నూలు, న్యూస్ వెలుగు; ఏపీఎస్ఆర్టీసీలో ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకోవాలని ఏపీ డీజీపీ ఏపీఎస్ఆర్టీసీ విసి అండ్ ఎండి ద్వారకా తిరుమలరావు అన్నారు. బుధవారం ఆయన కర్నూలు వన్ డిపో ను సందర్శించారు. ముందుగా ఆయనకు కర్నూల్ రీజినల్ మేనేజర్ శ్రీనివాసులు పూల బోకే ఇచ్చి స్వాగతం పలికారు. ముందుగా వంటి ప్రాంగణంలో మామిడి మొక్కను నాటారు. తదుపరి డిపో గ్యారేజ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు బస్సుల ఆపరేషన్ ద్వారా కార్గో సేవల ద్వారా ఆదాయాన్ని పెంచుతూ వ్యయాన్ని తగ్గించాలన్నారు. సిబ్బందికి రావాల్సిన అలవెన్సులు ఆర్పిఎస్ 2017 కు సంబంధించిన బకాయిలను ఈనెల లోగా ఇచ్చేటట్లు చర్యలు తీసుకుంటానని తెలిపారు తాను చేరిన 44 నెలలో కోటి 10 లక్షలు సాధారణ మరణం పొందిన వారికి ఇచ్చామన్నారు. నైట్ డ్యూటీ అలవెన్స్ ఈహెచ్ఎస్ అలవెన్స్ లో పరిష్కరించామన్నారు కారుణ్య నియామకాల కింద 1600 మందినీ ఉద్యోగాల్లో నియమించామన్నారు. పీఎఫ్ లో 960 కోట్లు లోన్లు సాధించామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు మంచి ప్రయాణ సౌకర్యాలు అందించి ఒక్కరోజులో 23 కోట్ల రూపాయలు ఆదాయం సాధించి రికార్డు సృష్టించామన్నారు. సిబ్బంది సంక్షేమం తాను చూసుకుంటానన్నారు తాను పదవీ విరమణ చేసేలోపు ముఖ్యమంత్రితో మాట్లాడి సిబ్బందికి రావాల్సిన బకాయిలన్నీ వచ్చేలాగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిజిపి తో పాటు కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పైడి చంద్రశేఖర్, కర్నూలు జిల్లా ప్రజారవాణా అధికారి టి శ్రీనివాసులు డిప్యూటీ మెకానికల్ ఇంజనీర్ వి హరిబాబు, 1,2 డిపోల మేనేజర్లు సిబ్బంది ఆర్టీసీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.