జలాశయనికి తగ్గిన వరద నిరు
Srisaialam : శ్రీశైలం జలాశయానికి వరద నిరు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయంలోని 10 గేట్లు 12 అడుగుల ఎత్తి నీటి విడుదల చేసినట్లు పేర్కొన్నారు. స్పిల్ వే ద్వారా 3,10,840 క్యూసెక్కులు నిరు విడుదల చేశామన్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 3.46 క్యూసెక్కుల ప్రవాహం ఉందన్నారు. శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులు కాగా , ప్రస్తుత నీటిమట్టం 883 అడుగులు ఉదన్నారు. జలాశయం గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలు కాగా , జలాశయం ప్రస్తుత నీటినిల్వ 204.7 టీఎంసీలు ఉన్నట్లు డ్యామ్ అడికారులు తెలిపారు.
కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి జరుగుతుందన్నారు. విద్యుదుత్పత్తి చేసి 63,836 క్యూసెక్కులు నిరు నాగార్జునసాగర్‌కు విడుదల చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
Was this helpful?
Thanks for your feedback!