
స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాలి
డోన్, న్యూస్ వెలుగు; డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆద్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధులు శ్రీ గరికపాటి మల్లవదాని  జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించారు.వారిని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు
శ్రీ గరికపాటి మల్లావధాని గారు సెప్టెంబరు 18, 1899 కొవ్వూరులో సీతారామయ్య, వెంకటసుబ్బమ్మ దంపతులకు జన్మించాడు.మన దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, సంస్కృతాంధ్ర పండితుడు. ఆయన జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ
స్ఫూర్తితో పాల్గొన్నాడు. ఆయన కవిగా పదుల సంఖ్యలో పుస్తకాలను రచించారు.ఆయన చదువు మానుకొని సహాయ నిరాకరణోద్యమంలో చేరి గ్రామ గ్రామానికీ పోయి జాతీయగీతాలు రాసి, పాడి, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉపన్యాసాలిచ్చి జనాన్ని మేలుకొలిపాడు.1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు కెళ్ళాడు.1947 లో సర్ సి.ఆర్.రెడ్డి కాలేజీలో తెలుగుపండితులుగా చేరి పెక్కుమంది శిష్య ప్రశిష్యులను సంపాదించి విశిష్ట భాషా సేవ ఒనర్చినాడు. గరికపాటి మల్లావధాని జనవరి 5, 1985 స్వర్గస్తులైనారు.ఇటువంటి మహనీయులను ఎల్లవేళలా స్మరించుకుంటూ విద్యార్థి దశ నుండే సేవాభావాన్ని పెంపొందించుకోవాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.
మీ
పి. మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త డోన్.


 Mahesh Goud Journalist
 Mahesh Goud Journalist