రైళ్లను పునరుద్ధరించండి : సిపిఐ

రైళ్లను పునరుద్ధరించండి : సిపిఐ

కరోనా కారణంగా నిలిచిపోయిన రైలు సర్వీసులను తక్షణమే ప్రారంభించాలి… సిపిఐ

* స్టేషన్ మాస్టర్ కు డిమాండ్ పత్రాన్ని అందజేసిన తుగ్గలి మండల సమితి సభ్యులు.

తుగ్గలి న్యూస్ వెలుగు: 

కరోనా కారణంగా నిలిచిపోయిన ప్యాసింజర్ మరియు ఎక్స్ప్రెస్ రైలు సర్వీసులను తక్షణమే ప్రారంభించాలని తుగ్గలి మండల సమితి సభ్యులు  పెండేకల్ ఆర్.ఎస్ స్టేషన్ నందు ధర్నాను నిర్వహించారు.జూన్ 7,8 తేదీలలో రైలు సర్వీసులను ప్రారంభించాలని ప్రజల అభిప్రాయం కొరకు సంతకాల సేకరణను సిపిఐ పార్టీ నాయకులు నిర్వహించారు.అనంతరం సోమవారం రోజున తుగ్గలి మండల సమితి రైల్వే స్టేషన్ ఎదుట ధర్నాను నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ కరోనా సమయమప్పటి నుండి రైలు సర్వీసులు సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలియజేశారు.వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్లే పేద ప్రజలు,చదువుల కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు సరైన సమయంలో రైలు సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు రైల్వే ఉద్యోగులకు తెలియజేశారు. రాయలసీమ జిల్లా కేంద్రాలను కలుపుతూ రైలు సర్వీసులను తక్షణమే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రజల సౌకర్యార్థం నూతన రైలు సర్వీసులను కూడా ప్రారంభించాలని వారు రైల్వే అధికారులకు డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నబి రసూల్,సిపిఐ మండల కార్యదర్శి సుల్తాన్,సిపిఐ నాయకులు సూరారెడ్డి, మాబు పీర,డీలర్ రాజశేఖర్,రైతు సంఘం నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!