20 నుండి పగిడిరాయి లో రీసర్వే పనులు
తహసిల్దార్ రమాదేవి
రీ సర్వేపై అవగాహన కొరకు గ్రామ సభలను నిర్వహించిన రెవెన్యూ అధికారులు.
తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జనవరి 20 నుండి పగిడిరాయి గ్రామం నందు 4వ విడత రీసర్వే పనులు ప్రారంభమవుతాయని తుగ్గలి తహసిల్దార్ రమాదేవి తెలియజేశారు. గురువారం రోజున మండల పరిధిలోని గల పగిడిరాయి గ్రామం నందు రీసర్వే పనులపై రెవెన్యూ అధికారులు గ్రామసభను నిర్వహించి అవగాహన కల్పించారు.ఈ గ్రామసభలో భాగంగా తహసిల్దార్ రమాదేవి మాట్లాడుతూ రైతులకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కారం కొరకే ప్రభుత్వం రీసర్వే పనులను నిర్వహిస్తుందని ఆమె తెలియజేశారు.రీసర్వే పనుల ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం ఉంటుందని ఆమె తెలియజేశారు.కావున ఈనెల 20 నుండి జరిగే రీసర్వే పనులకు గ్రామ ప్రజలు అధికారులకు సహకరించాలని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ నాగరాజు, మండల సర్వేయర్ సుధాకర్,వీఆర్వో నయోమి,విలేజ్ సర్వేయర్ వేణుగోపాల్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.