ఎల్లార్తి గ్రామంలో రెవిన్యూ సదస్సు

ఎల్లార్తి గ్రామంలో రెవిన్యూ సదస్సు

హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలోని ఎల్లార్తి గ్రామంలో మంగళవారం సర్పంచ్ కురువ చాముండేశ్వరి అధ్యక్షతన తహశీల్దార్ సతీష్ రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ భూమిలకు సంబంధించి ఏమైనా సమస్య ఉంటే రెవెన్యూ సదస్సులో అర్జీని అందిస్తే భూ సమస్యను పరిష్కరిస్తామన్నారు.సమావేశం వచ్చిన అర్జీలను పరిశీలించి త్వరితగతిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామ న్నారు.కావున రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్,విఆర్వోలు దామోదర,సూర్యాంజనేయులు,ప్రహ్లాద,కంప్యూటర్ ఆపరేటర్ నరసప్ప తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!