రెవిన్యూ సదస్సు రైతులకు అనుకూలమైనది
హోళగుంద,న్యూస్ వెలుగు: రెవెన్యూ సదస్సు రైతులకు ఎంతగానో సానుకూలంగా ఉపయోగ పడతాయని తహసీల్దార్ సతీష్ పేర్కొన్నారు. 
 శనివారం మండల పరిధిలోని హోన్నూరు గ్రామంలో సర్పంచ్ పద్మావతి అధ్యక్షతన రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ రైతులు భూ సమస్యల కోసం కార్యాలయం చుట్టూ తిరిగి విసుగు చెందాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తమ వద్దకే అధికారులను పంపి వారి సమస్యలను తెలుసుకునేలా చేసిందన్నారు.కావున ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని తమకున్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలియజేశారు.అనంతరం సర్పంచ్ భర్త నాగి రెడ్డి,విద్య కమిటీ ఛైర్మెన్ కాలప్ప,గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామానికి అంగన్వాడి కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సూర్యంజనేయులు,గ్రామ సేవకులు,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Was this helpful?
Thanks for your feedback!
			
 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda