
రెవెన్యూ సదస్సు విజయవంతం
న్యూస్ వెలుగు. ఒంటిమిట్ట; క్షేత్రస్థాయి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రెవెన్యూ సదస్సులో భాగంగా ఒంటిమిట్ట మండలం మంటపం పల్లె గ్రా
మంలో బుధవారం స్పెషల్ ఆఫీసర్ బ్రహ్మయ్య, తాసిల్దార్ రమణమ్మ నేతృత్వంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి బ్రహ్మయ్య భూ సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల భూ సమస్యలు సమావేశంలో తెలిపారు. అనంతరం రెవెన్యూ పరంగా ఏవైనా సమస్యలు ఉంటే త్వరితగతిన పూర్తి చేసి మండల ప్రజల మన్ననలు పొంది అభివృద్ధి దిశగా ప్రయాణం సాగించాలని రెవెన్యూ అధికారులకు తెలియజేశాడు. అదేవిధంగా భూ సమస్యల వల్ల గ్రామస్తులు ఎవరు గర్షణ పడవద్దని అది ఎవరికి మంచిది కాదని లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తుందని కావున సమస్యలు ఏమైనా ఉంటే రెవెన్యూ అధికారుల వద్ద శాంతియుతంగా పరిష్కారం చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ అంజన గౌరీ, మండల సర్వేయర్ ప్రియాంక, మంటపంపల్లి వీఆర్వో శ్రీనివాసులు, తదితర రెవెన్యూ సిబ్బంది సర్పంచ్ వెంకటయ్య , ఎంపీటీసీ సుంకేసుల భాష, ముద్దు. కృష్ణారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లె .బొబ్బిలి రాయుడు, మండల ఉపాధ్యక్షుడు మౌలాలి, శంకర్ రెడ్డి, షరీఫ్, బాదుల్లా, చంద్రమౌళి, చంద్రబాబు, వెంకటసుబ్బారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.