రికార్డు లేకుండా రెవిన్యూ సదస్సులు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల పరిధిలో లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ వీరుపాక్షి రెడ్డి అధ్యక్షతన తహసీల్దార్ సతీష్,డిప్యూటీ తహసీల్దార్ నిజాముద్దీన్ రెవిన్యూ సదస్సు నిర్వహించారు.ముఖ్యంగా భూమి రికార్డులు లేకుండా అధికారులు రెవిన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా సర్వే నెంబర్-346,a347aకు సంబంధించిన భూమిని 1998 లో గొర్రెల నిల్లమ్మ,మాల రంగమ్మతో పా టు పలువురు రైతులకు పట్టా పంపిణీ చేశారు.అయితే ప్రస్తుతం సదరు సర్వే నెంబర్ గల భూమిని 3 సంవత్సరాల క్రితం మరొకరికి పేరిట పట్టా ఇవ్వడం ఏమిటని గూడుడప్ప అనే రైతు తహశీల్దార్ ను ప్రశ్నించారు.ఇందుకు తహసీల్దార్ సతీష్ రికార్డులు చూస్తామని చెప్పారు.అలాగే రైతులు,ప్రజలు తమ భూ సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకోవాలని తెలియజేశారు.మరియు సమావేశంలో భూ సమస్యల పై 10 అర్జీలు,కుల ధ్రువీకరణ పత్రం కోరకు-27 అర్జీలు వచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు శేషగిరి,రామాంజనేయ,హనుమేష్,నవీన్,కిష్టప్ప,భీమ లింగ,హనుమేష్,వీఆర్వోలు లక్ష్మీనారాయణ రెడ్డి,ప్రహ్లాద,నాగరాజా కంప్యూటర్ ఆపరేటర్ బసవ, గ్రామ సర్వేర్లు,గ్రామ సేవకులు తదితరులు పాల్గొన్నారు.