
కళాశాలల గుర్తింపును రద్దు చేయండి: ఏఐఎస్ఎఫ్
కర్నూలు : స్థానిక కర్నూల్ నగరంలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇంటర్ విద్యార్థులకు వేసవి కాలం సెలవులు ఇవ్వకుండా. ఇంటర్ ఫస్టియర్ పూర్తి అయినా కనీసం వాళ్లు తమ రిజల్ట్స్ నీ కూడా చూడనివ్వకుండా ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ ఇయర్ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చలగాటమాడుతున్నారు.
విద్య సంవత్సరం ప్రారంభం కాకముందే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ ఇయర్ తరగతుల నిర్వహిస్తున్న శ్రీ చైతన్య, నారాయణ, SR కళాశాలల యాజమాన్యం పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు నిరసన చేస్తూ.. కళాశాల గుర్తింపును రద్దు చేయాలనీ డిమాండ్ చేశారు.
ఏఐఎస్ఎఫ్, కర్నూలు నగర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ నగరంలోని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి మరి బరితెగించి విద్యార్థులు జీవితాలను లెక్కచేయకుండా విద్యార్థులు ప్రాణాలతో చలగాటమాడుతూన్నా గాని కనీసం జిల్లా విద్యాశాఖ అధికారి ( ఆర్ ఐ ఓ ) స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. తక్షణమే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల యజమానంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు అభి నగర నాయకులు అరవింద్ నవీన్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

