రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడలకు ఎంపికైన రోళ్లపాడు విద్యార్థి

రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ క్రీడలకు ఎంపికైన రోళ్లపాడు విద్యార్థి

హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు..

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: తుగ్గలి మండలం పరిధిలోని మారుమూల గ్రామమైన రోళ్లపాడు గ్రామానికి చెందిన యువకుడు చరణ్ తేజ రాష్ట్రస్థాయి ఫుట్బాల్ క్రీడలకు ఎంపికయ్యారు.చరణ్ తేజ చిన్నప్పటి నుంచి పాఠశాలలో చదువును చదువుతూనే వివిధ క్రీడల్లో రానిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు.క్రీడల్లో రాణిస్తున్న చరణ్ తేజ ప్రతిభను గుర్తించిన ఉపాధ్యాయులు స్కూల్ గేమ్స్ క్రీడల్లో అవకాశాలు ఇస్తూ తన ప్రతిభను మరింత జటిలం చేస్తూ విద్యార్థి చరణ్ తేజ్ ను ప్రోత్సాహస్తూ క్రీడా రంగంలో మెరుగులు దిద్దుతున్న తరుణంలో స్కూల్ స్థాయి క్రీడల నుంచి జిల్లా స్థాయి క్రీడల్లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం అంబేద్కర్ జూనియర్ ఇంటర్మిడియట్ కళాశాల అరికేరలో ఇంటర్మిడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రాష్ట్ర స్థాయి క్రీడలలో భాగంగా జూనియర్ కళాశాల నుంచి చరణ్ తేజ్ ఈ నెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో అండర్ 19 ఫుట్ బాల్ క్రీడలు ఆడేందుకు రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికవ్వడం జరిగింది.ఈ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు చరణ్ తేజ ఎంపికవ్వడంతో రోళ్లపాడు గ్రామ పెద్దలు పసేద్దుల వెంకటేశ్వర్లు,చరణ్ తల్లీ తండ్రులు,గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేయడంతో విద్యార్థి పసేద్దుల చరణ్ తేజ్ క్రీడలలో ఇంకా అభివృద్ధిలోకి రావాలని వారు తెలియజేశారు.

Author

Was this helpful?

Thanks for your feedback!