రోప్ స్కిప్పింగ్ విజేత చరణ్య

రోప్ స్కిప్పింగ్ విజేత చరణ్య

తుగ్గలి, న్యూస్ వెలుగు ప్రతినిధి: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల పత్తికొండ నందు పదో తరగతి చదువుతున్న జామ్ జగ్గుల చరణ్య,సౌత్ జోన్ నేషనల్ రోప్ స్కిప్పింగ్ 2024-25, విన్నర్ గా గెలుపొందడం జరిగింది. చరణ్య తుగ్గలి గ్రామము ఎస్సీ కాలనీకి చెందిన అమ్మాయి.తండ్రి పేరు జె.వీరన్న, తల్లి పేరు జె.అఖిల, ఈ అవార్డు రావడం పట్ల తల్లిదండ్రులతో పాటు గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. పి ఈ టి గీత మాట్లాడుతూ తమ స్కూళ్లలో విద్యార్థినిలు చదువుతో పాటు క్రీడలలో రాణిస్తూ స్కూలుకు మంచి పేరు తెస్తూ ఈ అవార్డు రావడం చాలా సంతోషమని తెలిపారు. అలాగే టీచర్స్ విద్యార్థి ని కి తమ స్కూలుకు మంచి గౌరవప్రదమైన అవార్డును తేవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందుకు తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!