
పొలంలో దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
హోళగుంద, న్యూస్ వెలుగు: మండల కేంద్రం సమీపంలో ఆదివారం ఆదోని నుంచి హెబ్బటం మీదుగా హోళగుంద వైపుగా వస్తున్న ఆదోని డిపో ఆర్టీసీ రహదారి అధ్వానంగా ఉండడంతో బస్సు పంట పొలంలోకి దూసుకెళ్లింది.దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులకు ఇలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.ఈ సందర్భంగా ప్రయాణికులు మాట్లాడుతూ అధికారులు అధ్వానంగా ఉన్న రహదారిని బాగుచేయకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు మేలుకొని రహదారి పై దృష్టి సారించి మరిన్ని ప్రమాదాలు జరగక ముందే రహదారిని బాగుచేయించాలని కోరారు.
Was this helpful?
Thanks for your feedback!
			

 Journalist M. Mahesh Gouda
 Journalist M. Mahesh Gouda