ఆర్టీసీ రిక్రూట్మెంట్ డ్రైవర్లను రెగ్యులర్ చేయాలి
విశాఖపట్నం, న్యూస్ వెలుగు; విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 44వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించాను. బర్మా కాందిశీకుల భూములు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని బర్మా ఆంధ్రా కాందిశీకుల కేంద్ర సంఘం ప్రతినిధులు, 2013 ఏడాది ఆర్టీసీ రిక్రూట్మెంట్ డ్రైవర్లను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్ట్ ఆర్టీసీ డ్రైవర్లు, అగ్రిగోల్డ్ డిపాజిట్లు తిరిగి ఇప్పించాలని శ్రీకాకుళానికి చెందిన గంగాడ కొర్లమ్మ, భూ వివాదాల సమస్యలు, ఉద్యోగావకాశాలు కల్పించాలని వినతులు అందించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను.
Was this helpful?
Thanks for your feedback!