విద్యార్థుల కిడ్నాప్ పై వివరణ ఇచ్చిన ప్రిన్సిపల్

విద్యార్థుల కిడ్నాప్ పై వివరణ ఇచ్చిన ప్రిన్సిపల్

కర్నూలు, న్యూస్ వెలుగు;   సి బెళగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న సూర్యతేజ ఏడవ తరగతి చదువుతున్న నవీన్ అనే ఇద్దరు విద్యార్థులు కిడ్నాప్ అయినట్టుగా వస్తున్న వదంతులు అవాస్తవమని ఆ కాలేజీ ప్రిన్సిపల్ బలరాం తెలిపారు. సంక్రాంతి సెలవులు తర్వాత జనవరి 26న పాఠశాలకు వచ్చినట్లు ప్రిన్సిపల్ బలరాం తెలిపారు ఈ ఘటన జనవరి 27 మధ్యాహ్నం రెండు గంటల సమయంలో జరిగినట్లు పేర్కొన్నారు. విద్యార్థులు ఇద్దరు పోలీసుల సమక్షంలో తల్లిదండ్రులకు అప్పగించినట్లు ప్రిన్సిపల్ బలరాం వెల్లడించారు. విద్యార్థుల భద్రత పై తల్లిదండ్రులు ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని వారు భరోసా ఇచ్చారు. ఇలాంటివి జరకుండా చూసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. మరింత సమాచారం కోసం క్రింది నెంబర్ కు సంప్రదించవచ్చన్నారు 8500536187

Author

Was this helpful?

Thanks for your feedback!