ఒకే దేశం ఒకే మద్యం ధరలు : కొత్తూరు సత్యం
న్యూస్ వెలుగు, కర్నూలు; ఒకే దేశం ఒకే ఎన్నికలు ఎంత ముఖ్యమని భావిస్తున్న కేంద్రం ఒకే దేశం ఒకే మద్యం యస్ యస్ యస్వి ధరలు ఉండాలని కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ఖర్చు నానాటికి పెరిగిపోతున్న తరుణంలో ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉందన్నారు . ఈ మధ్యకాలంలో ఒక ఐఆర్ఎస్ అధికారి చేసిన ట్విట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చగా మారిందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికలు ఒకే దేశం ఒకే పన్ను విధానం ఉన్నప్పుడు ఒకే దేశం ఒకే మద్యం ధరలు ఎందుకు ఉండకూడదని ఆయన తెలిపారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క మద్యం ధరలు ఉన్నాయని గోవాలో 320 రూపాయల ఉన్నా వైన్ బాటిల్ కర్ణాటకలో 950 రూపాయలు పలుకుతుందన్నారు. ఒక రాష్ట్రంలో బంగారు ఒక ధర ఉంటే ఇంకో రాష్ట్రంలో బంగారం ధర ఇంకోలా ఎందుకు ఉందని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ ఒకే విధానంలో ఉన్నప్పుడు ధరలలో ఎందుకు తేడా ఉందని ఆయన ప్రశ్నించారు . ఒక రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఒక ధర ఉంటే ఇంకో రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ఇంకోలా ఎందుకు తేడా ఉందని ఆయన ప్రశ్నించారు . నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేటప్పుడు జీఎస్టీ పరిధిలోకి తెచ్చినప్పుడు ధరలు కూడా ఒకేలా ఉండాలని ప్రజలు కోరుతున్నారని అని తెలిపారు. ప్రజల అవసరాలు తగ్గట్టుగా పాలన సాగించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. సామాన్యులకు మధ్యతరగతులకు సంక్షేమ పథకాలు అందించడంలో తప్పు లేదని కానీ ఆర్థిక భారం పడకుండా చూడాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరుగుతుందని ప్రజలు ఆ దిశగా దృష్టి సారించాలని ఆయన కోరారు