సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిని కాపాడాలి
కడప జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షుడు
ఒంటిమిట్ట, న్యూస్ వెలుగు; సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిని పరిరక్షించాలని కడప జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షుడు , ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షుడు పసుపులేటి. శివశంకర్ శుక్రవారం ఉదయం కర్నూలు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ను ఒక ప్రకటనలో కోరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రకటనలో తెలియజేస్తూ హిందూ మతం కుంటు పడుతున్న నేపథ్యంలో సనాతన ధర్మం, భారతీయ సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ఎంతో ఉందని అన్నారు. అత్యంత ప్రధానంగా ఎండోమెంట్ ఉన్నతాధికారులు హిందూ దేవాలయాలను రక్షిస్తూ పూర్వ వైభవం తీసుకుని వచ్చి దేవాలయాలలో కొత్త కొత్త ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని దేవాదాయ ఉప కమిషనర్ ను ప్రకటనలో కోరడం జరిగింది. ప్రతి జిల్లా స్థాయిలో అర్చకులు దేవాలయ సిబ్బంది సమన్వయంగా ఉండి ఆధ్యాత్మిక భావాలు కలిగిన భక్తులతో సదస్సులు, ఉపన్యాసాలు నిర్వహిస్తూ భక్తి భావంతో అందరూ మెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరాడు. అంతేకాకుండా ఉపన్యాసకులతో ప్రజలకు, భక్తులకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఇప్పించాల్సిందిగా కోరాడు. ఈ విధంగా చేసినందువలన ఆలయాలను సందర్శించే భక్తుల మనసుల్లో ఆధ్యాత్మిక భావనలు పెంపొందించడమే కాకుండా ఆలయాల అభివృద్ధికి కృషి చేసి హిందూ మతానికి గట్టి పునాదులు వేసిన వారవుతారని అన్నారు. ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది సమన్వయంగా ఉండి దాతలను గుర్తించి ఆలయాల అభివృద్ధికి కృషి చేసే విధంగా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. కావున ఆలయాల అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా కర్నూలు దేవాదాయ శాఖ ఉప కమిషనర్ను ప్రకటనలో ఆయన కోరడం జరిగింది.