
4 వ వార్డులో ముమ్మరంగా పారిశుధ్య పనులు
పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపిన 4 వ వార్డు యువకులు….
హోళగుంద, న్యూస్ వెలుగు; హోళగుంద మండల కేంద్రంలోని స్థానిక 4 వ వార్డులో సర్పంచ్ చలువాది.రంగమ్మ ఆధ్వర్యంలో పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, సిబ్బందితో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు.4 వ వార్డులో ఉన్న ప్రభుత్వ స్థలంలో చెత్తా చెదారం వేస్తుండడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ ప్రభుత్వ స్థలంలో చెత్త పడేస్తుండడంతో దోమ
ల బెడద అధికమవడంతో పాటు, దుర్వాసన వెదజల్లెది. పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ శనివారం జేసీబి, ట్రాక్టర్ వాహనంతో ఈ స్థలంలో ఉన్న చెత్తను డంపు యార్డుకు తరలించారు.ఈ సందర్బంగా సాగునీటి సంఘం అధ్యక్షులు బి.ఉస్మాన్, 4 వ వార్డు యువకులు మహమ్మద్, సద్దాం, హఫీజ్, తాహేర్, అబూబకర్, అతవుల్ల, పంచాయితి కార్యదర్శి రాజశేఖర్ గౌడ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు ప్రభుత్వ స్థలంలో చెత్తచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లేదని, రంజాన్ మాసం కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారని అన్నారు. ఈ ప్రదేశంలో ఎవరు చెత్త వెయ్యకుండా తగిన చర్యలు తీసుకోవాలని,తద్వారా స్థానికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అన్నారు.