
విద్యార్థుల డబ్బులతో సంజో స్కూల్ అన్యువల్ డే సంబరాలు ..
డోన్ లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్న చోద్యం చూస్తున్న విద్యాధికారులు..
ఎన్ ఎస్ యు ఐ తెలుగు విజయ్ కుమార్
డోన్, న్యూస్ వెలుగు; ఎన్ ఎస్ యు ఐ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ సాంజో స్కూల్ పై చర్యలు తీసుకోవాలని
మరి ఈ సమస్త ఎన్నో సేవా దృక్పథంతో ఎంతో మంది విద్యార్థులకు మేలు చేయాలని పేద విద్యార్థులకు తక్కువ ఫీజులతో విద్యను ఇప్పించాలని సంకల్పంతో ఏర్పాటు చేయబడిన సంస్థ అయితే మరి డోన్ లో మాత్రం దానికి విరుద్ధంగా స్కూల్లో పుస్తకాలు అమ్మకూడదని ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులకు పుస్తకాలను అమ్మే కాంటాక్ట్ ఇచ్చి పిల్లల తల్లిదండ్రుల నుంచి వేలకు వేల రూపాయలు ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మరి వార్షికోత్సవ పేరుతో విద్యార్థులతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు అయితే ప్రైవేట్ పుస్తకాలను అమ్ముకుంటున్నారని విద్యాధికారులకు చెప్పినా కూడా వారి పట్ల ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుందని వారు అన్నారు ..
చట్టాలను నియమాలను ఉల్లంఘించి పాఠశాలల్లో ప్రైవేట్ పుస్తకాలను నోట్బుక్లను అమ్మకుండా మరి ఇప్పటికైనా విద్యాధికారులు ఇటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో విద్యాధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని వారు తెలియజేశారు..