పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 

పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 

కర్నూలు, న్యూస్ వెలుగు; జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు యాజమాన్యములలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత , ఉన్నతపాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమేమనగా అకాడమిక్ క్యాలండర్ 2024-25 ప్రకారము సంక్రాంతి సెలవులు తేది:10.01.2025 నుండి 19.01.2025 వరకు ప్రకటించడమైనది. పాఠశాలలు తేది:20.01.2025 సోమవారము న పునః ప్రారంభమవుతాయి. అలాగే మిషనరీ పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 11.01.2025 నుండి 15.01.2025 వరకు ప్రకటించడమైనది. మిషనరీ పాఠశాలలు 16.01.2025 గురువారం పునః ప్రారంభమవుతాయి.
సంక్రాంతి సెలవుల్లో పదవ తరగతి బోధిస్తున్న ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఫోన్ ద్వారా విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటూ అసైన్మెంట్ ఇచ్చి వారి సందేహాలను నివృత్తి చేసి మార్చి 2025 లో జరగబోయే SSC పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేయాలని కొరడమైనది.
జిల్లా లోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించవలసినదిగా జిల్లావిద్యాశాఖాధికారి .యస్.శ్యాముల్ పాల్ ఒక ప్రకటనలో తెలియజేసారు.

Author

Was this helpful?

Thanks for your feedback!