
డాక్టర్ శంకర్ శర్మ ఆధ్వర్యంలో సరోజిని నాయుడు జయంతి వేడుకలు..
కర్నూలు, న్యూస్ వెలుగు; కర్నూలు లోని సాయి గురుదత్త పాలిక్లినిక్ లో సరోజిని నాయుడు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సరోజినీ నాయుడు ఫిబ్రవరి 13వ తేదీ 1879 సంవత్సరంలో జన్మించారు. ఈమె మహిళా సాధికారత కోసం చేసిన కృషి చేయడం వల్ల సరోజిని నాయుడు జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా నిర్వహిస్తారని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈసందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ సరోజిని నాయుడు గొప్పతనాన్ని కొనియాడారు. భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా) గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు, కవయిత్రిగా మహిళల అభివృద్ధి కోసం పాటుపడ్డారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. సరోజిని నాయుడు స్వాతంత్ర్య ఉద్యమంలో చాలా సార్లు జైలు కు వెళ్లారని తెలిపారు.స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహిళా గవర్నర్ గా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశారన్నారు. సరోజిని నాయుడు జయంతి సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు బాగా చదువుకొని అభివృద్ధి చెందితే ఆ దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.